Social 1080×1350 • Multi-page
23-06-2026 BREAKING NEWS 09:59 PM
swarnodayam.com
Telugu Daily News

సర్ ప్రోగ్రాం గణన లెక్కించు ఫామ్స్ బహుభాషలో ఇవ్వాలని ఆర్డీవో కు కాంగ్రెస్ వినతి.

సర్ ప్రోగ్రాం గణన లెక్కించు ఫామ్స్ బహుభాషలో ఇవ్వాలని ఆర్డీవో కు కాంగ్రెస్ వినతి.
IMG_20260623_212140

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : భారత ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబోవు సర్ ప్రోగ్రాం ఈనెల జూన్ 25 నుండి ప్రతి బూత్ లెవల్ ఆఫీసర్ ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ కు ఎనిమరేషన్ / గణన లెక్కించు ఫామ్స్ ఇవ్వనుండగా తెలుగులో మాత్రమే ఉండడంతో సమస్యలు తలెత్తుతాయని బహు భాషలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు హుజురాబాద్ ఆర్టీవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మొలుగూరి సదయ్య ఆధ్వర్యంలో హుజురాబాద్ డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ జల కుమారికి ఆమె కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ ఓటర్ గణన లెక్కింపు ఫారంలో తెలుగులో మాత్రమే ఇవ్వబోతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో, హుజురాబాద్ నియోజకవర్గంలో ముస్లింలు, క్రిస్టియన్స్, ఇంగ్లీష్ మీడియం చదివిన పౌరులు తెలుగులో ఉన్న ఫారంలు నింపడం ఇబ్బంది కాబోతుంది కాబట్టి తెలుగుతోపాటు ఇంగ్లీష్ లో కూడా ముద్రణ ఉండాలని వారు కోరారు. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కు హుజురాబాద్ ఆర్డిఓ ద్వారా తెలుపుతూ మెమోరం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రావుల వెంకట్, జిల్లా కార్యదర్శి మిడిదొడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి టేకుల శ్రావణ్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరికుటి మదన్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్డీవో జల కుమార్ కి వినతిపత్రం ఇస్తున్న కాంగ్రెస్ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!