Social 1080×1350 • Multi-page
24-06-2026 BREAKING NEWS 06:21 PM
swarnodayam.com
Telugu Daily News

మహిళా సాధికారత తెలుగు అసోసియేషన్ మండల కో ఆర్డినేటర్ గా చెల్పూర్ సర్పంచ్

మహిళా సాధికారత తెలుగు అసోసియేషన్ మండల కో ఆర్డినేటర్ గా చెల్పూర్ సర్పంచ్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహిళల అభివృద్దే ధ్యేయంగా స్థాపించిన సంస్థ మహిళా ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ మహిళా సాధికారత తెలుగు అసోసియేషన్ హుజురాబాద్ మండల కో ఆర్డినేటర్ గా చెల్పూర్ గ్రామ సర్పంచ్ వంతడుపుల కస్తూరి నియామకమయ్యారు. గత నలభై సంవత్సరాలుగా హనుమండ్ల ఝాన్సీరెడ్డి పేద మరియు వెనకబడిన మహిళల అభివృద్దే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఎన్నో సేవ కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రభుత్య పాఠశాలలు, ఆసుపత్రులు మరియు లైబ్రరీలు కట్టించి సేవ చేస్తున్నారు. అదే ఉద్దేశంతో ఇపుడు మన రాష్ట్రంలోని మహిళల విద్య, వైద్యం, ఆర్థికంగా, సామాజికంగా మరియు సేవా రంగాలలో ఎదగాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థకు మన హుజురాబాద్ మండల కో ఆర్డినేటర్ గా విద్యావంతురాలు, చెల్పూర్ గ్రామ సర్పంచ్, సమాజ సేవ చేయాలనే సంకల్పం కలిగిన వ్యక్తి వంతడుపుల కస్తూరిని ఎంపిక చేయడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ పట్టణంలోని జూబ్లీ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఒక రోజు అవగాహన సదస్సుకు సర్పంచ్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని, మహిళల అభివృద్ధికోసం చక్కటి వేదికను ఏర్పాటు చేసిన ఝాన్సీరెడ్డి ని అభినందిస్తూ కో ఆర్డినేటర్స్ అందరు సేవ చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మండల కో ఆర్డినేటర్ వంతడుపుల కస్తూరి మాట్లాడుతూ హుజురాబాద్ మండలంలో చదువుకోవటంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రతి అమ్మాయికి చేయూత ఇస్తాను, అలాగే ప్రతి మహిళ అన్ని రంగాలలో ఎదగడానికి నా వంతు కృషి చేస్తానని, మహిళలకు ఏ ఆపద వచ్చిన ముందుంటానని తెలిపారు. కో ఆర్డినేటర్ గా ఎన్నికైన సర్పంచ్ కస్తూరిని మండల నాయకులు, ప్రజలు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!