Social 1080×1350 • Multi-page
24-06-2026 BREAKING NEWS 06:56 PM
swarnodayam.com
Telugu Daily News

సమాచార హక్కు చట్టం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మిట్టపల్లి సురేందర్ ఏకగ్రీవ ఎన్నిక

సమాచార హక్కు చట్టం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మిట్టపల్లి సురేందర్ ఏకగ్రీవ ఎన్నిక
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూన్ 24: నిజామాబాద్ నగరంలోని కపిల హోటల్ బ్యాంక్వెట్ హాల్‌లో జరిగిన న్యాయ సేవా ప్రజా చైతన్య సమితి రాష్ట్రస్థాయి మహాసభలో ఆ సంస్థ సమాచార హక్కు చట్టం విభాగానికి సంబంధించి కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా హుజురాబాద్ కు చెందిన మిట్టపల్లి సురేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు చాపల కిరణ్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి పుచ్చల నాగేష్ ల సంయుక్త సూచనల మేరకు ఆయనను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ సభకు రాష్ట్ర, జిల్లా పరిధిలోని వివిధ గ్రామాలు, మండలాలు, డివిజన్ల వారీగా ప్రతినిధులు, సమాచార హక్కు చట్టము కార్యకర్తలు తరలివచ్చారు.

సమావేశంలో నూతనంగా ఎన్నికైన మిట్టపల్లి సురేందర్‌కు రాష్ట్ర అధ్యక్షుడు చాపల కిరణ్ కుమార్ చేతుల మీదుగా అధికారిక నియామక పత్రం, గుర్తింపు కార్డును అందజేశారు. అనంతరం ఆయనను వారు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఈ గొప్ప బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కమిటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం 2005 పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ కమిటీ బలోపేతానికి నిరంతరం తన శక్తి మేరకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!