Social 1080×1350 • Multi-page
24-06-2026 BREAKING NEWS 11:56 PM
swarnodayam.com
Telugu Daily News

ముగిసిన హుజూరాబాద్ చేనేత సంఘ ఎన్నికలు.. – అధ్యక్షునిగా మూడవ సారి ఎలిగేటి ఉపేందర్ ఏకగ్రీవ ఎన్నిక.

ముగిసిన హుజూరాబాద్ చేనేత సంఘ ఎన్నికలు.. – అధ్యక్షునిగా మూడవ సారి ఎలిగేటి ఉపేందర్ ఏకగ్రీవ ఎన్నిక.
IMG_20260624_234124

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ చేనేత సహకార సంఘ ఎన్నికలు మంగళ, బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. 9 డైరెక్టర్ స్థానాలకు నిన్న ఎన్నికలు జరగగా, W.Cలో కొక్కుల రాజమణి, బూర్ల తిరుపతమ్మ, G.Cలో ఎలిగేటి ఉపేందర్, గుండేటి మహాదేవ్, ఆరుగొండ సమ్మరాజు, పత్తిపాక తిరుపతి, మంచికట్ల కమలాకర్, కోమటి సదానందం, తాటిపాముల తిరుపతి గెలిచినట్లు ఎన్నికల అధికారి అశోక్ కుమార్ తెలిపారు. ఇందులో నేడు ఉదయం అధ్యక్షుడిగా ఎలిగేటి ఉపేందర్, ఉపాధ్యక్షుడిగా తాటిపాముల తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. కాగా కోశాధికారి ఎన్నిక జరగకపోవడంతో త్వరలో జరగనున్నదని E.O వెల్లడించారు. అయితే అద్యక్షుడి ఎన్నిక సరిగా జరగలేదని, దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్లాలని చూస్తున్నట్లు పలువురు డైరెక్టర్లు, సభ్యులు తెలిపారు.

హుజురాబాద్ చేనేత సహకార సంఘముకు నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు..

మూడవసారి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎలిగేటి ఉపేందర్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!