Social 1080×1350 • Multi-page
25-06-2026 BREAKING NEWS 07:20 PM
swarnodayam.com
Telugu Daily News

మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి. -ఏఎస్ఐ కమల

మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి. -ఏఎస్ఐ కమల
IMG-20260625-WA0070

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజలు ముఖ్యంగా యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాటికి బానిస కావడంవల్ల అనేక అనర్థాలు కలుగుతాయని ఏఎస్ఐ కమల అన్నారు. గురువారం హుజూరాబాద్ లో ఆమె పలువురికి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్ మహేందర్ మాట్లాడుతూ…. మత్తుకు బానిస కావడం వల్ల యువకులు తమ జీవితాలను నష్టపోతున్నారని, బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అంజలి, పలువురు యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

గంజాయి, మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఏఎస్ఐ కమల, హెడ్ కానిస్టేబుల్ మహేందర్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!