Telugu Daily News
రైతన్నలు అధైర్యపడవద్దు..! -పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఓదెల మండలం, కొలనూరు గ్రామంలో శుక్రవారం రోజున ఉదయాన్నే ఐకేపీ, సింగిల్ విండో ఏర్పాటుచేసిన సెంటర్ లను సందర్శించి నిన్న కురిసిన వర్షానికి తడిసిన వడ్లను పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయ రమణారావు. లారీల కొరత లేకుండా చూడాలని, వడ్లు మ్యాచర్ చూసి ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని, వారం రోజుల్లో పూర్తిస్థాయిలో వడ్లను కొనుగోలు చేయాలని అధికారులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఆదేశించారు.
రైతులు ఎవరు అధైర్యపడవద్దని తమకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.


