Social 1080×1350 • Multi-page
25-06-2026 BREAKING NEWS 07:54 PM
swarnodayam.com
Telugu Daily News

పల్స్ పోలియో విజయవంతానికి కృషి చేయాలి. – ఎంపీడీవో తూర్పాటి సునీత

పల్స్ పోలియో విజయవంతానికి కృషి చేయాలి. – ఎంపీడీవో తూర్పాటి సునీత
IMG-20260625-WA0074

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల 28వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని హుజురాబాద్ మండలంలో విజయవంతం చేయాలని ఎంపీడీవో తూర్పాటి సునీత సూచించారు.

పల్స్ పోలియో విజయవంతం పై గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో హుజురాబాద్ ఎంపీడీవో తూర్పాటి సునీత సమీక్ష సమావేశము నిర్వహించారు. ఈ సమావేశంలో పల్స్ పోలియో విజయవంతం కోసం చేపడుతున్న చర్యలు, చేపట్టవలసిన చర్యల గురించి అధికారులు ఆమెతో చర్చించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జక్కని నరేందర్, హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ప్రభుదాస్, ఎంఈఓ విడపు శ్రీనివాస్, చెల్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మధు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ శేఖర్, ప్రవీణ్, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమ్యరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!