Social 1080×1350 • Multi-page
27-06-2026 BREAKING NEWS 09:21 PM
swarnodayam.com
Telugu Daily News

ఓటరు జాబితా ప్రక్షాళనలో అప్రమత్తత అవసరం.. – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంటోనీ రెడ్డి

ఓటరు జాబితా ప్రక్షాళనలో అప్రమత్తత అవసరం.. – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంటోనీ రెడ్డి
IMG-20260627-WA0063

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండడం అవసరమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంటోనీ రెడ్డి అన్నారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలో బిజెపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటూ అత్యంత విలువైనదని, భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బిజెపి నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, ఓటరు నమోదు, చిరునామా మార్పులు తప్పుల సవరణ వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి చేసే వెరిఫికేషన్ ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు నిరంతరం నిఘా ఉంచాలని, అర్హులైన వారెవరూ జాబితా నుండి తొలగించబడకుండా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, జిల్లా కార్యదర్శి నరసింహరాజు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గుర్రాల నిర్మలరెడ్డి, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, అధ్యక్షులు తూర్పాటి రాజు, కొండల్ రెడ్డి, కొలగాని రాజు, బైరెడ్డి రమణారెడ్డి, రమేష్, బత్తిని నరేష్, ర్యాకం శ్రీనివాస్, వొడ్నాల విజయ్, నీలం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంటోనీరెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!