Social 1080×1350 • Multi-page
29-06-2026 BREAKING NEWS 04:44 PM
swarnodayam.com
Telugu Daily News

బిఎల్ఎలు అప్రమత్తంగా ఉండాలి. – ప్రతి బిఎల్ఏ విధిగా బిఎల్ఓతో సర్ కార్యక్రమంలో పాల్గొనాలి. – కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్

బిఎల్ఎలు అప్రమత్తంగా ఉండాలి. – ప్రతి బిఎల్ఏ విధిగా బిఎల్ఓతో సర్ కార్యక్రమంలో పాల్గొనాలి. – కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
IMG-20260629-WA0055

—రంగాపూర్ గ్రామంలో జరుగుతున్న ఓట్ల జాబితా సమగ్రసవరణ ప్రక్రియ(సర్)లో పాల్గొన్న వొడితల ప్రణవ్…

—కొత్త ఓటర్లను జాబితాలో చేర్పించాలని సూచన.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఓటు జాబితా సవరణ ప్రక్రియ సర్ కార్యక్రమంలో ప్రతి బిఎల్ఏ తప్పనిసరిగా పాల్గొనాలని ప్రతి ఓటు చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సూచించారు. సోమవారం రోజున హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామంలో ఇంటింటికి జరుగుతున్న ఓటర్ జాబితా సమగ్ర సర్వేలో కో ఆర్డినేటర్లతో కలిసి ప్రణవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని బూత్ లలో బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, బిఎల్ఓలు ఇచ్చే సెట్ లను జాగ్రత్తగా నింపాలని, కొత్త ఓట్ల నమోదు ప్రక్రియలో అవగాహన కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఈ సవరణ ప్రక్రియ నిశితంగా పరిశీలిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్క ఓటు కూడా కోల్పోకుండా, గల్లంతు అవ్వకుండా నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్ ప్రక్రియ కో ఆర్డినేటర్లు, మండల అధ్యక్షుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు, గ్రామ శాఖ కో ఆర్డినేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!