Social 1080×1350 • Multi-page
17-05-2024 BREAKING NEWS 02:01 AM
swarnodayam.com
Telugu Daily News

ఐదు రోజులపాటు వర్షాలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:

తెలంగాణలో మరో 5 రోజులు వానలు..

తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ, తేలికపాటి వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. నేడు మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, హైదరాబాద్, గద్వాల్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!