Social 1080×1350 • Multi-page
30-06-2026 BREAKING NEWS 06:33 PM
swarnodayam.com
Telugu Daily News

సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల ధర్నా

సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల ధర్నా
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఎంతోకాలంగా అపరిస్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హుజూరాబాద్ తాసిల్దార్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా అధ్యక్షులు కదిరే రమేష్ మాట్లాడుతూ… పీవీ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని ఆన్నారు. సిఎస్సి హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా సహజ మరణానికి ఐదు లక్షలు పెంచాలని, పెండింగ్ క్లైమ్ వెంటనే నిధులను మంజూరు చేయాలని అన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన జీవో 12 ను రద్దుచేసి ప్రభుత్వ హెల్పర్ బోర్డు ద్వారానే కార్మికుల సంక్షేమ పథకాలు అందించాలని, రెన్యువల్ లేని 13 లక్షల మంది కార్మికుల లేబర్ కార్డు రెన్యువల్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 1996లో భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డులో అడ్వైజర్ కమిటీ నియమించాలని, నిర్ణయ ప్రకారమే బోర్డు నిధులు ఖర్చు చేయాలని, వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీ నియమించకుండా ప్రభుత్వం కార్మిక శాఖ అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడి ఎలాంటి గుర్తింపు లేని ఇన్సూరెన్స్ కంపెనీలకు స్కీములను అప్పగించి పేద నిర్మాణ కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. బోర్డు నుండి దాటా ఇవ్వలేదని చాకుచూపి వేలాదిమంది కార్మికులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుకొని వందల కోట్ల ఇన్సూరెన్స్ కంపెనీలు దోచుకున్నాయి. ఈ కార్యక్రమంలో మోర మహేష్ కొడిమాల వెంకటేష్ మల్ల మల్ల రవి గుర్రం నాగయ్య అన్నపు రమేష్ నీలం శ్రావణ్ పొడిచెట్టి ప్రభాకర్ పొడిసెట్టి ప్రభు మాట్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!