Social 1080×1350 • Multi-page
01-07-2026 BREAKING NEWS 11:39 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

హుజురాబాద్ లో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
IMG-20260701-WA0084

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని న్యూ శాతవాహన స్కూల్, శస్త్ర స్కూల్ ఆధ్వర్యంలో పిల్లలు వైద్యులకు శుభాకాంక్షలు తెలిపి డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా జరిపారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో న్యూ శాతవాహన విద్యార్థులు యాజమాన్యం డాక్టర్స్ కు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించారు. సమాజంలో వైద్యుల ప్రాధాన్యతపై పిల్లలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇన్చార్జి సూపరిండెంట్ డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి, ఆర్ ఎంఓ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బండి శృతి, డాక్టర్ శ్రీకర్ లకు సైతం వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూ శాతవాహన కరస్పాండెంట్ వాకులాభరణం వెంకటేశ్వర్లు, శస్త్ర కరస్పాండెంట్ వేణుమాధవ్, ప్రిన్సిపల్ ఏం సంగీత, ఉపాధ్యాయులు దివ్య, రాజెష్, సంగీత ,తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!