Social 1080×1350 • Multi-page
02-07-2026 BREAKING NEWS 12:02 AM
swarnodayam.com
Telugu Daily News

వరంగల్ అపోలో రీచ్ NSR ఆసుపత్రిలో ఉచిత గుండె వైద్య శిబిరం

వరంగల్ అపోలో రీచ్ NSR ఆసుపత్రిలో ఉచిత గుండె వైద్య శిబిరం
IMG-20260701-WA0085

స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్, జూలై 1:
గుండె సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో వరంగల్‌లోని అపోలో రీచ్ NSR హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్డియాలజీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు. జూలై 2 నుండి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆసుపత్రి ప్రాంగణంలో ఈ ప్రత్యేక శిబిరం కొనసాగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రముఖ నిపుణుడి పర్యవేక్షణలో పరీక్షలు
ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో ప్రముఖ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.ఫణీంద్ర పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. గుండె జబ్బుల లక్షణాలతో బాధపడుతున్న వారికి అవసరమైన విలువైన వైద్య సలహాలు, సూచనలు అందించనున్నారు. శిబిరానికి వచ్చే బాధితులకు ఉచిత కన్సల్టేషన్‌తో పాటు, ఈసీజీ (ECG), 2D ఎకో (2D Echo) పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా చేయనున్నారు.
పరీక్షలపై 50 శాతం రాయితీ
క్యాంప్‌లో స్క్రీనింగ్ అనంతరం వైద్యుల సూచన మేరకు తదుపరి ఇతర పరీక్షలు అవసరమైన వారికి ఫీజులో 50 శాతం వరకు ప్రత్యేక రాయితీ కల్పించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. జూలై 2 నుండి 4వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు వరంగల్ ఆరేపల్లి కొత్తపేట క్రాస్ రోడ్స్‌లోని అపోలో రీచ్ NSR ఆసుపత్రిలో ఈ శిబిరం జరుగుతుంది.
గుండె నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి వర్గాలు కోరాయి. ఇతర వివరాలు, ముందస్తు నమోదు కోసం 9459875555 నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!