Social 1080×1350 • Multi-page
03-07-2026 BREAKING NEWS 04:49 PM
swarnodayam.com
Telugu Daily News

జర్నలిజం కోర్సుకు దరఖాస్తుల స్వీకరణ

జర్నలిజం కోర్సుకు దరఖాస్తుల స్వీకరణ
IMG-20260703-WA0041

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జులై 4: హుజురాబాద్ లోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో బిఎ జర్నలిజం కోర్సుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వల్లూరి రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హుజురాబాద్ రీజియన్ లో జర్నలిజం కోర్సును నిర్వహిస్తున్న మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో జర్నలిజం కోర్సుకు అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు వారు తెలిపారు.
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు, ఓపెనింగ్ ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతోనే ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
రిపోర్టింగ్, యాంకరింగ్, న్యూస్ రీడర్, డెస్క్ ఆపరేటర్స్, ఎడిటర్, సబ్ ఎడిటర్, అడ్వర్టైజింగ్ వంటి రంగాలలో ఆసక్తి కలిగిన అభ్యర్థులు కళాశాలలో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని వారు సూచించారు. మరింత అదనపు సమాచారము కొరకు 94405 14629 ఫోన్ నెంబర్ కు సంప్రదించ వచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!