Social 1080×1350 • Multi-page
03-07-2026 BREAKING NEWS 09:03 PM
swarnodayam.com
Telugu Daily News

ఎస్ ఐఆర్ అమలులో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలి.. – కౌశిక్ రెడ్డి కళ్ళుండి చూడలేని కబోది.! – కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్

ఎస్ ఐఆర్ అమలులో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలి.. – కౌశిక్ రెడ్డి కళ్ళుండి చూడలేని కబోది.! – కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్
IMG-20260703-WA0054

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎస్ ఐఆర్ లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 14వ, 17వ వార్డులలో ఆయన విస్తృతంగా పర్యటించి సర్ పై అవగాహన కల్పించారు. వర్షం పడుతున్నప్పటికీ మామిళ్ల వాడలో ఇంటింటికి తిరిగి ఓటర్ల సర్వే పారాలు వచ్చాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ…
సమగ్ర ఓటు సవరణలో ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, దానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బిఎల్ఓ, బిఎల్ఏలను సంప్రదించాలని కోరారు. బీహార్, పశ్చిమ బెంగాల్ లో జరిగినట్టు ఇక్కడ కూడా ఓట్ల తొలగింపు కార్యక్రమం పేరుతో నిజమైన ఓటర్లను తొలగించకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ సవరణ ప్రక్రియ కార్యక్రమంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. దీనికి వార్డ్ కో ఆర్డినేటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఓటర్లకి అవగాహన కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు కళ్ళ ముందు కనిపిస్తుంటే, గ్యారంటీల్లో ఒక్కటైన ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశానికి స్వయంగా కౌశిక్ రెడ్డి వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తున్నాడని ఇది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పనితీరు అని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, ఉచిత బస్, రుణమాఫీ, రైతు భరోసా, రాజీవ్ ఆరోగ్య శ్రీ 10లక్షలకు పెంపు, మహిళా సాధికారతకు భరోసా ఇస్తూ వారికి వడ్డీలేని రుణాలు ఇచ్చామని అన్నారు. వైద్యo విషయంలో ముందుండాలని ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కోసం 30 లక్షలు, డయాలసిస్ సెంటర్ లు మంజూరు చేయించామని, ఇల్లందుకుంటలో నూతన రెవెన్యూ భవనం మంజూరు చేయించామని తెలిపారు. 2న్నర ఏండ్లు ఎమ్మెల్సీ, విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఇవి ఎందుకు చేయలేదని అన్నారు. ఇప్పుడిస్తున్న కళ్యాణ లక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నవే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని, కౌన్సిలర్లు ఖలీదు హుస్సేన్, వజ్జపల్లి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, ఆశు, చందమల్ల బాబు, కో ఆప్షన్ సభ్యులు, సర్ హుజురాబాద్ కో ఆర్డినేటర్, పాల్గొన్నారు

సర్ ఫారాలను పరిశీలిస్తున్న ప్రణవ్ బాబు..

ప్రణవ్ బాబును సన్మానిస్తున్న కార్యకర్తలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!