Social 1080×1350 • Multi-page
03-07-2026 BREAKING NEWS 10:44 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
IMG-20260703-WA0062

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ఉద్యోగ నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. హోం శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) పరిధిలో వివిధ విభాగాల్లో 5,000 ఖాళీల భర్తీకి అనుమతి మంజూరైంది.

ఈ నియామకాల ద్వారా పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. త్వరలో సంబంధిత నియామక సంస్థ ద్వారా పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

నిరుద్యోగ యువత ఇప్పటి నుంచే పరీక్షలకు సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!