Social 1080×1350 • Multi-page
04-07-2026 BREAKING NEWS 05:12 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా దివంగత సీఎం రోశయ్య జయంతి వేడుకలు.

ఘనంగా దివంగత సీఎం రోశయ్య జయంతి వేడుకలు.
IMG-20260704-WA0072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ రోంటాల సుహాసిని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రోశయ్య పేద ప్రజలకు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రోశయ్య జయంతినీ అధికారికంగా నిర్వహించాలని ఆదేశించడంతో ఈ వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి కిషన్, మేనేజర్ భూపాల్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, కౌన్సిలర్లు, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!