Social 1080×1350 • Multi-page
04-07-2026 BREAKING NEWS 09:37 PM
swarnodayam.com
Telugu Daily News

బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ నూతన కమిటీ ఎంపిక

బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ నూతన కమిటీ ఎంపిక
IMG-20260704-WA0110

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్నీ కమిటీలను నిబలోపేతం చేసేందుకు రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలతో, జిల్లా అధ్యక్షుల ఆమోదంతో నియోజకవర్గ అధ్యక్షులు గిన్నారపు మహేందర్ అధ్యక్షతన నియోజకవర్గ ఉపాద్యక్షులుగా కండె తిరుపతి, కార్యదర్శిగా మాతంగి అశోక్ నీ నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ జోన్ ఇంచార్జీ పల్లె ప్రశాంత్ గౌడ్, పార్లమెంట్ ఇంచార్జీ దొడ్డే శ్రీనివాస్ లు నూతనంగా నియమితులైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కప్పల రవి కుమార్, నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ అంబాల ప్రభాకర్ హాజరై బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షిరాం ఆశయాలను, బీఎస్పీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, నియోజకవర్గంలో బహుజన వర్గాలలో ఉన్న ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాటం చేయాలన్నారు.
రానున్న 2028 ఎన్నికలకు బహుజన కులాలను ఏకం చేసి రాజ్యాధికారం సాధించే దిశగా సాగాలని కోరారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మారపెల్లి మొగిలయ్య, సీనియర్ నాయకులు రామ్ రాజేశ్వర్, ఇల్లందుల రమేష్, అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!