Social 1080×1350 • Multi-page
17-05-2024 BREAKING NEWS 07:13 AM
swarnodayam.com
Telugu Daily News

ఈ విద్యా సంవత్సరం నుండి శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బిబిఏ కోర్స్ ప్రారంభం

ఈ విద్యా సంవత్సరం నుండి శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బిబిఏ కోర్స్ ప్రారంభం
IMG-20240517-WA0195

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్

గత15 సంవత్సరాల నుండి హుజురాబాద్ డివిజన్లో సైన్స్, కామర్స్, ఆర్ట్స్ కోర్సులతో హుజురాబాద్ డివిజన్ స్థాయిలో విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తు, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి కొత్తగా బీబీఏ (బాచిలర్ అఫ్ బిజినెస్ అడ్మినియట్రేషన్ ) కోర్స్ను ప్రారంభిస్తున్నామని కళాశాల కరెస్పాండంట్ ఏనుగు మహిపాల్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో సైన్స్, కామర్స్, ఆర్ట్స్ కోర్సులో పాస్ అయినా విద్యార్థులందరు ఈ కోర్సులో చేరడానికి అర్హులు అన్నారు. ఈ కళాశాలలో బీబీఏతో పాటు బీకామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్), బీఎస్సీ(ఎంపీసీఎస్/ఎంసీసీఎస్/ఎంపీసీ), బీఎస్సీ(బీజడ్సీ) కోర్సులు కలవన్నారు. కనుక విద్యార్థులు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే విద్యార్థులు దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని బీబీఏ కోర్సులో అడ్మిషన్స్ పొందవచ్చాన్నారు. ఇతర వివరాలకు కళాశాల కరెస్పాండంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి సెల్ 9885069146 లో సంప్రదించాలన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!