Social 1080×1350 • Multi-page
08-07-2026 BREAKING NEWS 06:39 PM
swarnodayam.com
Telugu Daily News

19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి. – హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ప్రభుదాస్

19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి. – హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ప్రభుదాస్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సమాజంలో ఉన్న 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ప్రభుదాస్ అన్నారు. బుధవారం హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నులిపురుగుల నివారణ దినోత్సవ సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒకటి నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఈ నెల 13న ఆల్ బెండజోల్ మాత్రలను వేయాలని అన్నారు. నులిపురుగుల వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని దానివల్ల రక్తహీనత తదితర వ్యాధులు సక్రమిస్తాయన్నారు. పిల్లలు తమ గోర్లను శుభ్రంగా ఉంచుకోవాలని బహిరంగ మలవిసర్జన మానుకోవాలని భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి అన్నారు. హుజురాబాద్ ఎంపీడీవో తూర్పాటి సునీత మాట్లాడుతూ…. ఆరోగ్యకరమైన అలవాట్లు పిల్లలకు ఉంటే ఆనందకరమైన బాల్యం అవుతుందని అన్నారు. మనమంతా కలిసి ఆరోగ్యకరమైన భవిష్యత్తు ను నిర్మించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ మధు, హుజురాబాద్ బస్తీ దౌకాల వైద్యాధికారిని డాక్టర్ జరీనా, విజేందర్ రెడ్డ, సిఆర్పిలు గూండా రాజిరెడ్డి రంగు దామోదరచారి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!