Social 1080×1350 • Multi-page
08-07-2026 BREAKING NEWS 11:22 PM
swarnodayam.com
Telugu Daily News

జమ్మికుంటలో వైయస్సార్ కు ఘన నివాళి.

జమ్మికుంటలో వైయస్సార్ కు ఘన నివాళి.
IMG_20260708_232034

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
వీరంనేని పరుశరామ్ రావు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా అధ్యక్షురాలు తోట స్వప్న, గిరవేన శ్రీనివాస్ యాదవ్, దొగ్గల భాస్కర్, పింగిలి రాకేష్, పింగిలి రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడిగ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ రాచపల్లి సాగర్, బిజిగిరి శ్రీకాంత్, కోరపల్లి మరియు వెంకటేశ్వర్ల పల్లి గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పోల్సాని సాగర్ రావు, కొండు బిక్షపతి, బండారి శ్రీధర్, పుల్లూరు రవి, మేకల కొమరయ్య, కనకం కుమార్, పుల్లూరు సంపత్, పుల్లూరి సమ్మయ్య, కుమార్, రామచంద్ర, సమ్మయ్య, మహేష్, జమ్మికుంట మండల అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వైయస్సార్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!