Social 1080×1350 • Multi-page
09-07-2026 BREAKING NEWS 01:30 PM
swarnodayam.com
Telugu Daily News

చేపలు పట్టేందుకు వెళ్లి మత్స్యకారుడి దుర్మరణం.. – భార్య బిడ్డల కళ్ళేదుటే అనంత లోకాలకు.

చేపలు పట్టేందుకు వెళ్లి మత్స్యకారుడి దుర్మరణం.. – భార్య బిడ్డల కళ్ళేదుటే అనంత లోకాలకు.
IMG_20260709_132759

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: చేపలు పట్టేందుకు మత్స్యకారుడు వెళ్లి ప్రమాదవశాత్తు భార్యాబిడ్డల కళ్ళ ఎదుటే దుర్మరణం చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువులో ఉదయం చేపలు పట్టడానికి వెళ్లి చెరువులో పడి మత్స్య కార్మికుడు ఈర్ల రవిందర్(48) మృతి చెందాడు.

నీటిలో మునిగిన రవీందర్ ను బయటకు తీసి పరీక్షిస్తున్న 108 సిబ్బంది..

తోకలపల్లి, రాజపల్లి, చెల్పూర్ గ్రామానికి చెందిన మత్స్య కార్మికులు సుమారు యాభై మంది గురువారం చెరువులో చేపలు పట్టడానికి వెళ్లగా రవీందర్ కాలికి ఉన్న బేడి వలలో చిక్కుకుని నీటిలో మునిగిపోయాడు. సమీపంలో ఉన్న పలువురు అతనిని గమనించి వెళ్లి నీటిలో నుంచి బయటకు తీయగా అప్పటికే నీరు మింగి ఉండడంతో ప్రథమ చికిత్స చేసి 108 ద్వారా హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఊపిరాడక మృతి చెందినట్లు నిర్ధారించారు.

మృతి చెందిన ఈర్ల రవీందర్

మృతునీ కుటుంబ సభ్యులు ఆ సమయంలో అతనికి కొంత దూరంలోనే ఉండగా వారి కళ్ళేదుటే నీటిలో మునిగి ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందడంతో వారి విరోధనాలు నిన్ననంటాయి. భార్య రజిత, ముగ్గురు కుమారులు మృతునికి ఉన్నారు. భార్య పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!