Social 1080×1350 • Multi-page
09-07-2026 BREAKING NEWS 07:45 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవం వేడుకలు

ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవం వేడుకలు
IMG_20260709_194155

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

పట్టణంలో ర్యాలీ తీస్తున్న విద్యార్థులు ఏబీవీపీ నాయకులు

ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అభిలాష్ మాట్లాడుతూ… దేశ నిర్మాణంలో ఏబీవీపీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. కొద్ది మందితో ప్రారంభమై 78 లక్షలమంది విద్యార్థులు సభ్యులుగా ఉన్న ఏబీవీపీ విద్యార్థి లోకానికి ఉన్న సమస్యలపై విస్తృత పోరాటాలు చేసిందన్నారు. భారత్ మాతాకి జై అంటూ అనేక మంది ఎబివిపి కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎబివిపి పట్టణ సంయుక్త కార్యదర్శి సాయి చరణ్, అజయ్, ఉపాధ్యక్షులు రాజు, ఆదిత్య, మనీ ప్రీతం, రామ్ చరణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!