Social 1080×1350 • Multi-page
09-07-2026 BREAKING NEWS 09:55 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో రెండు రోజులు అంతరాయం.

హుజురాబాద్ లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో రెండు రోజులు అంతరాయం.
IMG-20260709-WA0121

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎల్ఎండి లోని ఇన్‌టేక్ వెల్‌లో వరంగల్‌కు సంబంధించిన మోటార్ల మరమ్మత్తు గురువారం జరుగుతున్నందున ఈ నెల 10, 11వ తేదీలలో మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ బి కిషన్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ… మరమ్మత్తు పనుల కారణంగా హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పదవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:00 గంటల నుండి 11వ తేదీ శనివారం సాయంత్రం 7:00 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని చెప్పారు. ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అవసరమైన మేరకు ముందుగానే తాగునీటిని నిల్వ చేసుకోవాలని, తాత్కాలికంగా ప్రత్యామ్నాయ నీటి వనరులను వినియోగించుకోవాలని ఆయన కోరారు.

మున్సిపల్ కమిషనర్ బి కిషన్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!