Social 1080×1350 • Multi-page
10-07-2026 BREAKING NEWS 09:37 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో అక్రమoగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత

హుజురాబాద్ లో అక్రమoగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేస్తుండగా అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలిస్తున్న వాహనం శుక్రవారం లభ్యమయింది. అక్రమ బియ్యం తరలింపును అరికట్టే చర్యల్లో భాగంగా శుక్రవారం అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మహేంద్ర బొలెరో వాహనం అనుమానాస్పదంగా కనపడింది. దానిని ఆపి తనిఖీ చేయగా అందులో 101 బియ్యం సంచులు కనపడ్డాయి. వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా పిడిఎస్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసింది. దీంతో అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ కు చెందిన నార్ల రవీందర్ గుప్తా వీటిని తరలిస్తున్నట్టు గుర్తించారు. పలువురు వద్ద కొనుగోలు చేసిన బియ్యాన్ని రవాణా చేస్తుండగా పట్టుకోవడంతో ఆయనపై కేసు నమోదు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇల్లందుల వినోద్ కుమార్, కానిస్టేబుల్ వేణులు తెలిపారు.

పిడిఎస్ బియ్యంను మహేంద్ర బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వ్యాపారి నార్ల రవీందర్ గుప్తా

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!