11-07-2026 NORMAL NEWS 07:09 PM
swarnodayam.com
Telugu Daily News
11-07-2026 07:09 PM By Mandala Yadagiri

అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్స్‌లో మూడు రోజుల ఉచిత ప్రత్యేక మహిళా గైనకాలజీ ఆరోగ్య శిబిరం

అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్స్‌లో మూడు రోజుల ఉచిత ప్రత్యేక మహిళా గైనకాలజీ ఆరోగ్య శిబిరం
IMG_20260711_190716

స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్: మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యానికి పునాది అనే లక్ష్యంతో అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్స్, వరంగల్ ఆధ్వర్యంలో జూలై 13, 14, 15 తేదీలలో మూడు రోజుల పాటు ఉచిత ప్రత్యేక మహిళా గైనకాలజీ ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం శనివారం వెల్లడించింది.
ఈ శిబిరంలో ప్రముఖ ప్రసూతి & స్త్రీ వ్యాధుల నిపుణురాలు డా. రమ్య దాస్యం (MBBS, DGO, Fellow in Infertility, Fellow in Diagnostic & Operative Hysteroscopy) పాల్గొని మహిళలకు సమగ్ర వైద్య సేవలు అందించనున్నారు.


ఈ సందర్భంగా పీసీఓడీ (PCOD), పీరియడ్స్ సమస్యలు, సంతానలేమి, వైట్ డిశ్చార్జ్, ఫైబ్రాయిడ్స్, గర్భాశయ సంబంధిత వ్యాధులు, మెనోపాజ్ సమస్యలు వంటి మహిళల్లో తరచుగా కనిపించే అనారోగ్య సమస్యలకు నిపుణుల సలహాలు, అవసరమైన చికిత్సలు అందించబడతాయన్నారు.
అలాగే శిబిరానికి హాజరయ్యే మహిళలకు హిమోగ్లోబిన్ పరీక్ష, రాండమ్ బ్లడ్ షుగర్ పరీక్ష, అవసరమైతే వైద్యుల సూచన మేరకు అల్ట్రాసౌండ్ పెల్విస్ స్కాన్ ఉచితంగా నిర్వహించ బడుతుందన్నారు.
శిబిరం ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్, కొత్తపేట క్రాస్ రోడ్, వరంగల్‌లో నిర్వహించబడుతుందనీ తెలిపారు.
మహిళలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఈ ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది.


శిబిరంలో పాల్గొనదలిచిన వారు ముందస్తు నమోదు కోసం 9459875555 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!