11-07-2026 NORMAL NEWS 08:07 PM
swarnodayam.com
Telugu Daily News
11-07-2026 08:07 PM By Mandala Yadagiri

క్రీడల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు..- హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని. – ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల స్థాయి స్మారక కబడ్డీ పోటీలు ప్రారంభం

క్రీడల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు..- హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని. – ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల స్థాయి స్మారక కబడ్డీ పోటీలు ప్రారంభం
IMG_20260711_200737

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: క్రీడల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల స్థాయి సీఐ పి సమ్మయ్య ( రణధీర్), జి మల్లయ్య, జి మూర్తి, జి బాలరాజు ల స్మారక కబడ్డీ పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలకు రెండు ఉమ్మడి జిల్లాల నుండి సుమారు 40 కబడ్డీ టీములు పాల్గొన్నాయి.

మాట్లాడుతున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ….ఆటల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, దృఢత్వం పెరుగుతుందన్నారు. ఏ పోటీలలో అయినా గెలుపు ఓటములు సహజమని వాటిని క్రీడాకారులు ఒకే విధంగా తీసుకోవాలని దీన్ని ఆదర్శంగా తీసుకొని జీవితంలో వచ్చే ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ముందుకు సాగడానికి ఇవి అవసరమవుతుందన్నారు. అంతక ముందు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించినట్లు ప్రకటించారు.

క్రీడాకారుల టీషర్టులను ఆవిష్కరిస్తున్న అతిథులు..
క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించి పరిచయం చేసుకుంటున్న చైర్పర్సన్ సుహాసిని, ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గూడూరు అంజలి, కౌన్సిలర్లు కోయల్ కార్ భారతి, సొల్లు సునీత, ఎంఈఓ విడపు శ్రీనివాస్, టోర్నమెంట్ అధ్యక్షులు గండ్ర సమ్మిరెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సొల్లు సారయ్య, హుజురాబాద్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మౌటం రవీందర్, కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజయ్య, మాడ్రన్ కబడ్డీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రవెల్లి సంపత్ రావు, ఫిజికల్ డైరెక్టర్లు వెంకట్ రెడ్డి, కొన్ని రాజిరెడ్డి, చిరుత శ్రీనివాస్, యేముల రవికుమార్, రేణుక, భాగ్యలక్ష్మి, కబడ్డీ సీనియర్ క్రీడాకారులు ఆరె తిరుపతి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు..

వీక్షిస్తున్న అతిథులు, అధికారులు, సీనియర్ క్రీడాకారులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!