12-07-2026 NORMAL NEWS 10:57 PM
swarnodayam.com
Telugu Daily News
12-07-2026 10:57 PM By Mandala Yadagiri

చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి. – సిఐటియు.

చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి. – సిఐటియు.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భవన కార్మికుల, ఇతర కార్మికుల సమస్యలపై ఈనెల 20న నిర్వహించే తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని
తెలంగాణ బిల్డింగ్, అధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా సదస్సు అధ్యక్షులు కదిరే రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో కార్మికుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు మాట్లాడుతూ… భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు, జీఓ నెం.12 ద్వారా అప్పగించి 346 కోట్లు నిబంధనలను ఉల్లంఘించి కట్టబెట్టారనీ ఆరోపించారు. కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేని సిఎస్సి సంస్థ ద్వారా హెల్త్ టెస్టులు చేయించుతూ రూ.750 కోట్లు ఆ సంస్థకు ప్రభుత్వం దోచి పెట్టిందనీ, వెల్ఫేర్ బోర్డులో 54 వేల పెండింగ్ క్లెయిమ్స నిధులు విడుదల చేయకుండా, 13 లక్షల కార్మికుల కార్డులు రెన్యువల్ చేయకుండా, కొత్త సంక్షేమ పథకాలు పెట్టకుండా, ఉన్న సంక్షేమ పథకాలకు నిధులు పెంచకుండా వేల కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు, సిఎస్ సి సంస్థలకు అక్రమంగా ఇచ్చారనీ అన్నారు. వెల్ఫేర్ బోర్డు స్కీములు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని, సిఎస్సి హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని, బోర్డు నిధులు కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని, పెన్షన్, పిల్లల చదువులకు స్కాలర్షిప్లు, ఇందిరమ్మ ఇండ్లు తదితర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. 20న అన్ని జిల్లాల్లో ర్యాలీలు చేసి కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, జిల్లా ఉపాధ్యక్షలు పళ్ళ తిరుపతి, జభూకం వెంకన్న, చక్రపాణి, జిల్లా సహాయ కార్యదర్శి రాజకుమారి, రేణికుంట సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!