Social 1080×1350 • Multi-page
13-07-2026 BREAKING NEWS 09:08 AM
swarnodayam.com
Telugu Daily News

“విజయం ఒక జట్టుదే ….క్రీడా స్ఫూర్తి ప్రతి క్రీడాకారుడిదే ” -మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని..- క్రీడలతో ఉద్యోగానికి పునాది. – ఏసిపి మాధవి. – ముగిసిన రెండు ఉమ్మడి జిల్లాల కబడ్డీ పోటీలు.

“విజయం ఒక జట్టుదే ….క్రీడా స్ఫూర్తి ప్రతి క్రీడాకారుడిదే ” -మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని..- క్రీడలతో ఉద్యోగానికి పునాది. – ఏసిపి మాధవి. – ముగిసిన రెండు ఉమ్మడి జిల్లాల కబడ్డీ పోటీలు.
IMG-20260713-WA0000

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: క్రీడా పోటీలలో విజయం ఒక జట్టుదే ….క్రీడా స్ఫూర్తి ప్రతి క్రీడాకారుడిది అని” హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని పేర్కొన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల స్థాయి సీఐ పి సమ్మయ్య(రణధీర్), జి మల్లయ్య, జి మూర్తి, జి బాలరాజు ల స్మారక కబడ్డీ పోటీలు ముగిసాయి. ఈ పోటీలకు రెండు ఉమ్మడి జిల్లాల నుండి సుమారు 40 కబడ్డీ టీములు పాల్గొనగా మొదటి బహుమతి అశోక్ నగర్, రెండో బహుమతి PN పంతర్స్ కాటారం, మూడవ బహుమతి హుజురాబాద్ క్లబ్, నాలుగో బహుమతి హుజురాబాద్ సీనియర్స్ గెలవడం జరిగింది. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేశారు.

చైర్ పర్సన్ సుహాసిని మాట్లాడుతూ.. ఆటల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు. ఏ పోటీలలో అయినా గెలుపు ఓటములు సహజమని వాటిని క్రీడాకారులు ఒకే విధంగా తీసుకోవాలని దీన్ని ఆదర్శంగా తీసుకొని జీవితంలో వచ్చే ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ముందుకు సాగడానికి ఇవి అవసరమవుతుందన్నారు.

క్రీడలతో యువతకు ఉద్యోగానికి పునాది పడుతుందని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి తెలిపారు. తను క్రీడాకారిణి అని, క్రీడల ద్వారానే తనకు ఉద్యోగం రావడానికి బీజం పడిందన్నారు. యువత తమకు ఇష్టమైన క్రీడను తీసుకుని అందులో రాణించాలన్నారు.

అతిథులతో క్రీడాకారులు, క్రీడల నిర్వాహకులు..

ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గూడూరు అంజలి, మేఘన వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ సుహాసిని, ఎలకతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్రవంతి, కౌన్సిలర్లు కోయల్ కార్ భారతి, సొల్లు సునీత, టోర్నమెంట్ అధ్యక్షులు గండ్ర సమ్మిరెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సొల్లు సారయ్య, హుజురాబాద్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మౌటం రవీందర్, కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజయ్య, మాడ్రన్ కబడ్డీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రవెల్లి సంపత్ రావు, దాతలు గూడూరి ప్రభాకర్ రెడ్డి, దామెర అనురాగ్, ఫిజికల్ డైరెక్టర్లు వెంకట్ రెడ్డి, కొన్ని రాజిరెడ్డి, చిరుత శ్రీనివాస్ ,యేముల రవికుమార్, రేణుక , భాగ్యలక్ష్మి కబడ్డీ సీనియర్ క్రీడాకారులు ఆరె తిరుపతి, మహేందర్ రెడ్డి, క్రీడాకారులు, క్రీడాభిమానులు, హుజురాబాద్ పట్టణవాసులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!