13-07-2026 NORMAL NEWS 06:01 PM
swarnodayam.com
Telugu Daily News
13-07-2026 06:01 PM By Mandala Yadagiri

జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం హుజురాబాద్ డివిజన్ లో విజయవంతం.

జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం హుజురాబాద్ డివిజన్ లో విజయవంతం.
IMG-20260713-WA0082

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ డివిజన్ పరిధిలోని సైదాపూర్, శంకరపట్నం, చెల్పూర్, వావిలాల, ఇల్లందకుంట, వీణవంక, చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అంగన్ వాడి సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు ప్రైమరీ పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, హైస్కూలు, జూనియర్ కాలేజీలలో ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను దగ్గర ఉండి నమిలిచ్చి మింగించారని హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రభుదాసు సోమవారం ఒక ప్రకటన తెలిపారు. హుజురాబాద్ డివిజన్ పరిధిలో 45 వేల 723 మంది పిల్లల గాను 40727 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు దగ్గర ఉండి నెమలిచ్చి మింగించారని తెలిపారు. డివిజన్లో 90 శాతం కార్యక్రమము విజయవంతం అయిందని, మిగిలిన 10% ఈనెల 20వ తేదీ నాడు మిగిలిన పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ మింగేస్తారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

నులిపురుగుల గోలీలు మింగిస్తున్న చైర్పర్సన్ సుహాసిని

హుజురాబాద్ లో…హుజురాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు హుజురాబాద్ మునిసిపాలిటీ చైర్పర్సన్ రోంటాల సుహాసిని జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, సమతుల ఆహారాన్ని భుజించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ప్రభుదాస్, డిటిసిఓ డాక్టర్ హిమబిందు, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ జరీనా, కౌన్సిలర్లు వి శ్రీలేఖ, ఎస్ సునీత, వైద్య సిబ్బంది పంజాల ప్రతాప్, సదానందం, విజయేందర్ రెడ్డి, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!