Social 1080×1350 • Multi-page
16-07-2026 BREAKING NEWS 07:01 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థానం. -ఇంటర్ విద్యాధికారి ఆంజనేయరావు

విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థానం. -ఇంటర్ విద్యాధికారి ఆంజనేయరావు
IMG_20260716_185857

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు వచ్చి క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థానం పొందవచ్చని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వి. ఆంజనేయరావు అన్నారు. గురువారం ఆయన హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రధమ తరగతి విద్యార్థుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నారని వాటిని విద్యార్థులు వినియోగించుకోవాలి అన్నారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ తేనివారు వెంటనే తెచ్చి కళాశాలకు సమర్పించాలని, ప్రథమ సంవత్సర విద్యార్థులకు ప్రవేశం పొందడానికి అవకాశం కలదని అన్నారు. పట్టుదలతో, క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసినచో అనుకున్నది సాధించగలరనీ చెప్పారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ తులసి దాస్, అధ్యాపకులు వాసుదేవరావు, బండి రాజశేఖర్, విజేందర్ రెడ్డి, రమణ, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!