Social 1080×1350 • Multi-page
17-05-2024 BREAKING NEWS 12:24 PM
swarnodayam.com
Telugu Daily News

రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు

రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు
Screenshot_20240517-231429_Chrome

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: రేషన్ కార్డు లేకున్నా, ఆరోగ్య శ్రీ పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా వైద్యారోగ్యశాఖ చర్యలు మొదలు పెట్టింది. సీఎం సూచనతో ఆరోగ్య శ్రీ పథకం ఇంప్లిమెంట్ పై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. రేషన్ కార్డులు లేకుండా ఆరోగ్య శ్రీకార్డులను ఎలా ఎంపిక చేయాలి..? ఏ ప్రాతిపాదికన అర్హతను ఫైనల్ చేయాలి..? ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్ని రద్దు చేస్తూ తీసుకురాబోతున్న కొత్త రూల్స్తో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదా..? వంటి తదితర అంశాలపై అధికారులు స్టడీ చేస్తున్నారు. దీంతో పాటు ఆరోగ్య శ్రీ కార్డుపై స్పీడ్గా వైద్యం అందించేందుకు గ్రీన్ ఛానల్ సిస్టం ఏర్పాటుకు కూడా ప్రణాళికను తయారు చేస్తున్నారు. అంతేగాక ప్రస్తుతం ఆరోగ్య శ్రీలో ఉన్న ప్రొసీజర్లు,ఆసుపత్రుల ధరల పెంపుపైనా అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు. పేదల ట్రీట్మెంట్ ను వేగంగా అందించేందుకు అవసరమైన చర్యలన్నీ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆరోగ్య
శ్రీ లిమిట్ రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు
పెంచగా, కొత్త విధానాలపై సీఎంకు ఓ నివేదిక
సమర్పించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆయన
నిర్ణయం తర్వాత ప్రభుత్వం కొత్త విధానాన్ని
అందుబాటులోకి తీసుకురానున్నదని వెల్లడించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!