Social 1080×1350 • Multi-page
17-07-2026 BREAKING NEWS 11:17 AM
swarnodayam.com
Telugu Daily News

వానలు కురవాలని గ్రామస్తుల కప్పతల్లి ఆటలు.

వానలు కురవాలని గ్రామస్తుల కప్పతల్లి ఆటలు.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వర్షాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ఇప్పటికి వర్షాలు కురావకపోవడంతో కరువుతో అల్లాడుతున్న ప్రజలను సమృద్ధిగా వర్షాలు కురిపించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో గ్రామస్తులు కప్పతల్లి ఆటలు ఆడి వాన దేవున్నీ ఆహ్వానించారు. ఉదయం గ్రామస్తులు రోకలిబండకు కప్పలను గుడ్డులో కట్టుకొని ఇల్లు తిరుగుతూ కప్పతల్లి కప్పతల్లి కడవడే నీళ్లు అంటూ పాటలు పాడుతూ గ్రామంలో తిరిగారు. గ్రామస్తులు ఇంటి వద్దకు రాగానే బిందెలతో కప్పలపై కర్రలు ఎత్తుకున్న వారిపై నీళ్లు చల్లి వానదేవునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులతో పాటు గ్రామ పెద్దలు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రోకలి బండకు కప్పలు కట్టుకొని కప్పతల్లి ఆటలాడుతున్న సిరసపల్లి గ్రామస్తులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!