Social 1080×1350 • Multi-page
17-07-2026 BREAKING NEWS 07:16 PM
swarnodayam.com
Telugu Daily News

సర్ పై క్షేత్రస్థాయిలో పరిశీలించండి..- కాంగ్రెస్ నేత ప్రణవ్.

సర్ పై క్షేత్రస్థాయిలో పరిశీలించండి..- కాంగ్రెస్ నేత ప్రణవ్.
IMG_20260717_191432

నియోజకవర్గ స్థాయి కో-ఆర్డినేటర్లతో ముఖ్య సమావేశాన్ని నిర్వహించిన ప్రణవ్.

సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సర్ కో ఆర్డినేటర్ల ముఖ్య సమావేశంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ బూత్ లో ఓట్ల సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రతీ ఓటరు ముఖ్యం కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లతో నిరంతరం మాట్లాడాలని కోరారు. క్రింది స్థాయిలో జరిగే సరళిని రాష్ట్ర పీసీసీ పరిశీలిస్తున్నారని, ఎన్నికల కమిషన్ పొడిగించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కో ఆర్డినేటర్లను కోరారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే స్పందించి నియోజవర్గ స్థాయి ఇంచార్జ్ లకు, బిఎల్ఓ, సంబంధిత అధికారులకి సమాచారం అందించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గస్థాయిలో మొదటి స్థాయిలో ఉండేలా ప్రతి కార్యకర్త, బిఎల్ఏ, కో ఆర్డినేటర్లు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు, సర్ నియోజవర్గ కో ఆర్డినేటర్ సదయ్య, అన్ని మండలాల, పట్టణ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, కో ఆర్డినేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!