Social 1080×1350 • Multi-page
18-07-2026 BREAKING NEWS 02:51 PM
swarnodayam.com
Telugu Daily News

అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో మూడు రోజుల ఉచిత జనరల్ మెడిసిన్ మెగా ఆరోగ్య శిబిరం

అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో మూడు రోజుల ఉచిత జనరల్ మెడిసిన్ మెగా ఆరోగ్య శిబిరం
IMG_20260718_144423

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
వరంగల్, జూలై 18:
ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్, వరంగల్ ఆధ్వర్యంలో ప్రముఖ జనరల్ ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్ డా. ఎన్ రాజిరెడ్డి (MBBS, DNB)n సేవలతో జూలై 21, 22, 23 తేదీలలో ప్రత్యేక ఉచిత జనరల్ మెడిసిన్ ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

ఈ శిబిరంలో మధుమేహం (డయాబెటిస్), అధిక రక్తపోటు (బీపీ), థైరాయిడ్ వ్యాధులు, వైరల్ జ్వరాలు, సాధారణ ఆరోగ్య సమస్యలు వంటి అనారోగ్యాలపై నిపుణుల వైద్య పరీక్షలు, సలహాలు మరియు అవసరమైన చికిత్స అందించబడుతుంది.
ఆరోగ్య శిబిరంలో భాగంగా సీబీపీ (CBP), రక్తంలో చక్కెర పరీక్ష (RBS/HBS), సీరమ్ క్రియాటినిన్ పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తారు. అలాగే లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, హెచ్‌బీఏ1సీ (HbA1c) వంటి ముఖ్యమైన రక్త పరీక్షలపై 50% ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నారు.
మధుమేహం, బీపీ, థైరాయిడ్ వంటి వ్యాధులు ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా, నిర్లక్ష్యం చేస్తే గుండె, మూత్రపిండాలు, కంటి చూపు వంటి కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి సమయానికి చికిత్స పొందాలని సూచించారు.
ఈ శిబిరం జూలై 21, 22, 23 తేదీలలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్, కొత్తపేట క్రాస్ రోడ్, ఆరెపల్లి, వరంగల్ లో నిర్వహించబడుతుంది.
ప్రజలందరూ ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది. అపాయింట్‌మెంట్ & వివరాలకు: 📞 94598 75555
.

ప్రముఖ జనరల్ ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్ డా. ఎన్ రాజిరెడ్డి (MBBS, DNB)..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!