Social 1080×1350 • Multi-page
18-07-2026 BREAKING NEWS 11:39 PM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ఫోర్స్ లో ఘనంగా మెహందీ వేడుకలు

ఆల్ఫోర్స్ లో ఘనంగా మెహందీ వేడుకలు
IMG_20260718_233651

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో శనివారం రోజున మెహందీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినిలు సాంప్రదాయ దుస్తులు ధరించి గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్లి ఆకులు తీసుకుని పాఠశాలలో ఏర్పాటు చేసిన రోలులో రుబ్బి గోరింటాకు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యార్థి సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆషాడ మాసంలో భారతీయ స్రీలు పవిత్రమైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన మాసం అనీ, ఈ నెలలో మహిళలు గోరింటాకు (మెహందీ) ధరించడం ఒక అందమైన సంప్రదాయం. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాకుండా శుభం, సౌభాగ్యం, ఆనందం మరియు ఆరోగ్యానికి ప్రతీకగా భావించబడుతుందనీ, గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని అందించి, వర్షాకాలంలో ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆయుర్వేదంలో కూడా పేర్కొనబడిందనీ అలాగే అమ్మవారి పూజలు, ఆషాఢ శుక్రవారాలు, బోనాలు వంటి పండుగల సందర్భంగా మహిళలు, యువతులు గోరింటాకు ధరించి భక్తి, ఆనందం మరియు సంప్రదాయాన్ని చాటుకుంటారనీ తెలియజేశారు. అలాగే కిండర్ గార్టెన్ పిల్లలు రేనీ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల గదులు అందంగా తయారు చేయబడి పిల్లలచే వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో భాగంగా పేపర్ బోట్స్ తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!