Social 1080×1350 • Multi-page
19-07-2026 BREAKING NEWS 08:03 PM
swarnodayam.com
Telugu Daily News

డిగ్రీ ప్రవేశాలకు చివరి అవకాశం..

డిగ్రీ ప్రవేశాలకు చివరి అవకాశం..
1006116577

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ దోస్త్ ప్రక్రియ చివరి విడత స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ ను జూలై 17న ఉన్నత విద్యా మండలి విడుదల చేసిందని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మైపాల్ రెడ్డి , ప్రిన్సిపాల్ బొక్కల ప్రవీణ్ రెడ్డి తెలిపారు. స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ ప్రకారం జులై 20 నుంచి 26 వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. 27 వరకు వెబ్ ఆప్షన్ల ద్వారా కళాశాలలో కోర్సులను ఎంపీక చేసుకోవచ్చన్నారు. జులై 30న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సీటు పొందిన వారు జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు. జులై 31 నుంచి ఆగస్టు 1లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలన్నారు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా లేదా నిర్ణీత గడువులో కళాశాలలో రిపోర్ట్ చేయకపోయినా కేటాయించిన సీటు రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేయని విద్యార్థులు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి స్పెషల్ ఫేజ్ లో పాల్గొనవచ్చనీ పేర్కొన్నారు. సిసి ఓటిపి ద్వారా కళాశాలలో ప్రవేశం పొందిన వారికి విద్యార్థిని విద్యార్థులకు స్పెషల్ ఫేజ్ లో అవకాశం ఉండదన్నారు.


స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలుపుతున్నవారు: విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్, హుజురాబాద్:

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!