Social 1080×1350 • Multi-page
19-07-2026 BREAKING NEWS 09:22 PM
swarnodayam.com
Telugu Daily News

పారదర్శకంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు. – కాంగ్రెస్ నేత వి ప్రణవ్ బాబు

పారదర్శకంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు. – కాంగ్రెస్ నేత వి ప్రణవ్ బాబు
IMG-20260719-WA0065

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా జరిగిందని, రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు సైతం పారదర్శకంగానే ఉంటుందని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. ఆదివారం హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో ఎండి మౌలానా సలీంబీ దంపతుల ఇందిరమ్మ గృహప్రవేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పేదలంతా సొంత ఇల్లు కలిగి ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో నిరుపేదలు ఎవరు ఇండ్లు లేకుండా ఉండకూడదనేదే తన లక్ష్యమని అన్నారు. నిజమైన అర్హులకే రెండవ విడుతలో 100% ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అన్నాడి మాధవి, ఉప సర్పంచ్ కాశీరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నాడి రవీందర్ రెడ్డి, యాళ్ళ రాజేశ్వరరెడ్డి పోతారం భాస్కర్, మిడిదొడ్డి రాజు, బొక్కల రాంరెడ్డి, రత్నాకర్ రెడ్డి, గొపగోని మల్లేష్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు.




స్వర్ణోదయం డిజిటల్ పేపర్ యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు

తెలియజేస్తున్న వారు : విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్, హుజురాబాద్:

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!