Social 1080×1350 • Multi-page
20-07-2026 BREAKING NEWS 08:20 PM
swarnodayam.com
Telugu Daily News

విద్య, వైద్యం అందుబాటులోకి తేవడమే ఫౌండేషన్ లక్ష్యం. – సిర్సపల్లిలో 8 లక్షలతో వాటర్ ప్యూరిఫైర్. – జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి

విద్య, వైద్యం అందుబాటులోకి తేవడమే ఫౌండేషన్ లక్ష్యం. – సిర్సపల్లిలో 8 లక్షలతో వాటర్ ప్యూరిఫైర్. – జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి
IMG_20260720_201239

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యo అందుబాటులోకి తేవడం జయన్న ఫౌండేషన్ లక్ష్యం అని జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత -జయపాల్ రెడ్డిలు వెల్లడించారు. సోమవారం హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరి ఫైర్, కూల్ వాటర్ ను వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ….తన భర్త జైపాల్ రెడ్డి సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని, దానికి తన వంతు బాధ్యతగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటున్నానని చెప్పింది. హుజురాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో అనేక సమాజ సేవ కార్యక్రమాలు పౌండేషన్ ద్వారా చేపట్టానన్నారు. ఇప్పటివరకు మండలంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల లో ఏర్పాటు చేశామన్నారు. రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు. బాలికలకు సానిటరీ ప్యాడులు ఉచితంగా అందించినట్లు తెలిపారు.

అనంతరం పౌండేషన్ చైర్మన్ గుడిపాటి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ…. తాను సామాన్య రైతు కుటుంబంలో జన్మించానని, బాల్యంలో తాను పడిన కష్టాలు ఈ తరం పిల్లలు పడకూడదు అనే భావనతో పౌండేషన్ ద్వారా మండలంలోని వందలాది మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడులు, పెన్నులు, పరీక్ష సమయంలో ఒక్కొక్క విద్యార్థికి 700 రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. సమాజంలోని నిరుపేదలకు తన వంతు సేవా కార్యక్రమంలో భాగంగా 1285 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లను చేయించినట్లు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి వాటర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డబ్బున్న వారికే అందుబాటులో ఉండే డెడ్ బాడీ ఫ్రీజర్లు పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా త్వరలోనే 20 ఫ్రీజర్లను కొనుగోలు చేసి హుజురాబాద్లో అందుబాటులో పెడతా నని, ఫ్రీజర్ కు రవాణా చార్జీలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ ప్రాంత ప్రజలకు ముప్పుగా వాటిల్లిన డంపింగ్ యార్డ్ ఏర్పాటు కాకుండా ఉండేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి హైకోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు. హుజురాబాద్ ప్రాంత ప్రజల ప్రయోజనం కోసమే ఫౌండేషన్ పని చేస్తుందన్నారు.

గ్రామ సర్పంచ్ పోల్సాని రామారావు మాట్లాడుతూ… స్వార్థం నిండిన వ్యక్తులు ఉన్న ఈ ప్రపంచంలో ప్రజల కోసం నిస్వార్ధంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న జైపాల్ రెడ్డి గొప్పవాడని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో జయన్న ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న సేవలు ఎనలేని వన్నారు. డంప్ యార్డ్ ఉద్యమంలో జయన్న అందించిన చేయూత ఎన్నటికీ మరువలేనిది అన్నారు.

ప్రారంభోత్సవానికి ముందు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జయన్న ఫౌండేషన్ నిర్వాహకులు

సందర్భంగా పలువురు వక్తలు సరిత జైపాల్ రెడ్డిల సేవలను కొనియాడుతూ వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జనగామ రాజేశ్వరరావు, సర్పంచులు కట్టుకూరి మల్లారెడ్డి, కస్తూరి, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, వంగల వెంకట్ రెడ్డి, వెంకట్రావు, హనుమంతరావు, ఎడ్ల విజయ్ కుమార్, వేల్పుల రత్నం, కౌన్సిలర్ ఖలీద్ హుస్సేన్, ఇంద్రసేనారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

జయన్న ఫౌండేషన్ నిర్వాహకులను, శాలువాలతో జ్ఞాపకలతో ఘనంగా సన్మానిస్తున్న గ్రామపంచాయతీ పాలకవర్గం, అభిమానులు, గ్రామస్తులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!