Social 1080×1350 • Multi-page
21-07-2026 BREAKING NEWS 08:26 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం హుజురాబాద్ అధ్యక్షునిగా జయవర్ధన్

ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం హుజురాబాద్ అధ్యక్షునిగా జయవర్ధన్
IMG_20260721_202738

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం హుజురాబాద్ అధ్యక్షునిగా పట్టణానికి చెందిన గంజి జయవర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని పెన్షనర్ భవన్ లో సంఘ ఎన్నికల కోసం సమావేశం జరిగింది. 21న నామినేషన్లు 22న ఎన్నికలు జరగాల్సి ఉండేది కానీ అధ్యక్ష పదవి కోసం గంజి జయవర్ధన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో అతడిని ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి దొంత శ్రీనివాస్, ఎన్నికల పరిశీలకులు జి మనోహర్ గౌడ్ లు తెలిపారు. తనను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్న సంఘం సభ్యులందరికీ, నాయకులందరికీ జయవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ పాషా, జిల్లా సంఘ జాయింట్ సెక్రెటరీ వీరస్వామి, అసోసియేట్ అధ్యక్షులు ఇన్చార్జి అధ్యక్షులు లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.


స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలుపుతున్నవారు: శ్రీ గోస్కుల వివేక్ గారు, పిఎసిఎస్ సెక్రటరీ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!