Social 1080×1350 • Multi-page
22-07-2026 BREAKING NEWS 07:58 PM
swarnodayam.com
Telugu Daily News

రాహుల్ గాంధీ అరెస్టుపై కదంతొక్కిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…

రాహుల్ గాంధీ అరెస్టుపై కదంతొక్కిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…
IMG-20260722-WA0113

విద్యార్థులపై లాఠీ ఛార్జ్,కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్..

గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేపర్ లీకులు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని, శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసి, విద్యార్థులకు మద్దతుగా లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీనీ అరెస్ట్ చేయడం దుర్మార్గమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. బుధవారం రోజున కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని గాంధీనగర్ కార్ఖానా గడ్డ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

కార్యక్రమానికి మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, గ్రంథాలయ ఛైర్మెన్ సత్తు మల్లేశం, సుడా మాజీ ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,నగర అధ్యక్షుడు అంజన్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి యువత ప్రధాన బలమని చెప్పిన ప్రధాని మోదీ ఆ యువతపై దాడి చేయించడం సమంజసంకాదని,వారి పక్షాన కోట్లాడుతున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. భేషరతుగా నీట్ ఎగ్జామ్ పేపర్ లేకు సంబంధించి వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అన్నారు. అనంతరం గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీయగా,పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని బీజేపీ అవలంభిస్తున్న తీరుపై వ్యతిరేక నినాదాలు చేశారు. స్థానికంగా ఉన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఈ విషయంపై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


*లోకల్ యాడ్స్*

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ గోస్కుల వివేక్ గారు, పిఎసిఎస్ సెక్రటరీ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!