Social 1080×1350 • Multi-page
18-05-2024 BREAKING NEWS 05:29 AM
swarnodayam.com
Telugu Daily News

రైతులు ఆందోళన చెందొద్దు..

రైతులు ఆందోళన చెందొద్దు..
IMG-20240518-WA0125

-రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ

  • రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
  • తడిచిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
  • వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ను వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క)
  • స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:

గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు పూర్తిగా దెబ్బతినడం జరిగిందని, ములుగు జిల్లాలో
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సూచించారు. శనివారం హైదరాబాదులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతన్నలకు అండగా ప్రభుత్వం ఉంటుందని జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ లను వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!