Social 1080×1350 • Multi-page
24-07-2026 BREAKING NEWS 01:03 PM
swarnodayam.com
Telugu Daily News

తాత ఆశయాలను కొనసాగిస్తా ప్రజలకు మరింత సేవ చేస్తా…వొడితల ప్రణవ్..

తాత ఆశయాలను కొనసాగిస్తా ప్రజలకు మరింత సేవ చేస్తా…వొడితల ప్రణవ్..
IMG-20260724-WA0052

వొడితల రాజేశ్వర్ రావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రణవ్,కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.

ఆయన సేవలు భావి తరానికి మార్గదర్శకం..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాజ్యసభ సభ్యుడిగా,రాజకీయాల్లో ప్రభుత్వం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఆనాటి భారత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కు చేదోడు వాదోడుగా ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కీలక కృషి చేసిన మహానుభావుడు వొడితల రాజేశ్వర్ రావు అని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రణవ్.

ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు,ఆయన అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.హుజూరాబాద్ పార్టీ కార్యాలయంలో ఇంచార్జి ప్రణవ్,సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రాజేశ్వర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష ఉండకూడదని విద్యాసంస్థలను నెలకొల్పి వారికి ఉచిత విద్యను అందించారని,ఈ ప్రాంత బిడ్డగా నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి పనులు రాజ్యసభ సభ్యుడిగా చేశారని, ఇప్పటికీ వారి అభివృద్ధి ఆనవాళ్లు ఇంకా ఉన్నాయని అన్నారు. వారు చూపిన బాటలో ప్రజలకు మరింత సేవ చేస్తానని ప్రణవ్ అన్నారు.

కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, వైస్ చైర్మన్ అంజలి, కౌన్సిలర్లు, దేవాలయాల చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మెన్లు, డైరెక్టర్లు, అన్ని మండలాల, పట్టణ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డ్ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్, బీసీ ఎస్సీ, యువజన, సేవాదళ్, అనుబంధ సంఘాలు, సోషల్ మీడియా, యూత్ కాంగ్రెస్, మైనారిటీ నాయకులు, సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!