Social 1080×1350 • Multi-page
25-07-2026 BREAKING NEWS 02:28 PM
swarnodayam.com
Telugu Daily News

అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో మూడు రోజుల ప్రత్యేక న్యూరో క్యాంప్. – ప్రముఖ న్యూరో సర్జన్ డా. అభిలాష్ గజ్జల ఆధ్వర్యంలో అత్యాధునిక పరీక్షలు, నిపుణుల వైద్య సేవలు

అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో మూడు రోజుల ప్రత్యేక న్యూరో క్యాంప్. – ప్రముఖ న్యూరో సర్జన్ డా. అభిలాష్ గజ్జల ఆధ్వర్యంలో అత్యాధునిక పరీక్షలు, నిపుణుల వైద్య సేవలు
IMG-20260725-WA0015

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్, జూలై: నరాలు, మెదడు మరియు వెన్నుపూస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్, కొత్తపేట, వరంగల్ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక న్యూరో క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

ఈ క్యాంప్‌లో ప్రముఖ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డా. అభిలాష్ గజ్జల రోగులను ప్రత్యక్షంగా పరీక్షించి, వ్యాధి తీవ్రతను అంచనా వేసి అవసరమైన చికిత్సపై సమగ్ర సలహాలు అందించనున్నారు.
నిరంతర తలనొప్పి, మెదడు సంబంధిత సమస్యలు, పక్షవాతం, చేతులు–కాళ్లలో తిమ్మిర్లు, మెడ నొప్పి, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలు, నరాల బలహీనత, వెన్నుపూస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ ప్రత్యేక క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు.

క్యాంప్ సందర్భంగా న్యూరో ప్రొఫైల్ రక్త పరీక్షలు కేవలం రూ.1,000కే అందించబడతాయి. అలాగే సీటీ స్కాన్, ఎన్సిఎస్ స్కాన్, ఈఈజీ వంటి అత్యవసర నిర్ధారణ పరీక్షలు కూడా ప్రత్యేక రాయితీ ధర రూ.1,000కే నిర్వహించబడతాయి. అంతేకాకుండా వెన్నుపూస శస్త్రచికిత్సలపై 20 శాతం వరకు ప్రత్యేక తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.

ఈ క్యాంప్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించబడుతుంది. నరాల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.
ప్రజలు ముందస్తుగా తమ పేర్లు నమోదు చేసుకుని ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది.
స్థలం: అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్, కొత్తపేట క్రాస్ రోడ్, అరేపల్లి, వరంగల్ – 506006.
అపాయింట్‌మెంట్ & వివరాలకు: 94598 75555
లో సంప్రదించాలన్నారు.


#లోకల్ యాడ్స్#

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!