Social 1080×1350 • Multi-page
25-07-2026 BREAKING NEWS 07:54 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో భక్తిశ్రద్ధలతో బీరన్న బోనాల వేడుకలు

హుజురాబాద్ లో భక్తిశ్రద్ధలతో బీరన్న బోనాల వేడుకలు
IMG-20260725-WA0068

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం హుజూరాబాద్ పట్టణంలో యాదవులు కురుమలు భక్తిశ్రద్ధలతో బీరన్న దేవునికి బోనాల పండుగను కన్నుల పండుగగా జరుపుకున్నారు.

బోనాల వేడుకలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, పలువురు పాలకవర్గ సభ్యులు, అధికార పార్టీ నాయకులు..

హిందువులకు తొలి పండుగ గా భావించే తొలి ఏకాదశి పండుగ రోజున యాదవులంతా ఇండ్లను చక్కగా అలంకరించుకొని పండగ వాతావరణం తీసుకొచ్చారు. మహిళలు అందంగా ఆలంకరించిన బోనాలను తలపై పెట్టుకుని డప్పు చప్పులతో ఊరేగింపుగా బీరన్న దేవాలయానికి తరలి వెళ్లారు. గణేష్ నగర్ సమీపంలో ఉన్న బీరన్న దేవాలయంలో సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. యాదవులు కురుమలు చేసుకునే బీరన్న బోనాల వేడుకలకు హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్ ఇల్లందుల సమ్మయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల తిరుపతి, యాదవ నాయకులు బద్దుల రాజకుమార్, మాజీ కౌన్సిలర్ మక్కపల్లి కుమార్ యాదవ్, భాషబోయిన రవి, లెoకలపల్లి రవి, చెల్పూరి కొమరమ్మ, గాదెమ్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.

చైర్మన్, కౌన్సిలర్లను, నాయకులను సన్మానిస్తున్న గొల్ల, కురుమ సంఘం నాయకులు..


శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!