Social 1080×1350 • Multi-page
25-07-2026 BREAKING NEWS 08:31 PM
swarnodayam.com
Telugu Daily News

నీట్ విద్యార్థి అమరులకు ప్రజా సంఘాల కొవ్వొత్తులతో నివాళులు

నీట్ విద్యార్థి అమరులకు ప్రజా సంఘాల కొవ్వొత్తులతో నివాళులు
IMG-20260725-WA0083

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నీట్ పేపర్ లీకేజ్ మూలంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళిగా శనివారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజా సంఘాలు, అఖిలపక్ష సంఘ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.

తాసిల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ….ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం దిగి రావడం ప్రజాస్వామ్య విజయమని, విద్యార్థి లోకం తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదని అన్నారు. రాబోయే కాలంలో అయినా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించాలని లీకేజీలు లేకుండా చూడాలని అన్నారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలతో యువ శక్తి ఎంతో దేశ ప్రజలకు అర్థమైంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

నీట్ విద్యార్థి అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్న దళిత, ప్రజాసంఘాల నాయకులు..


&లోకల్ యాడ్స్&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్, హుజురాబాద్ కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!