Social 1080×1350 • Multi-page
25-07-2026 BREAKING NEWS 11:28 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా తొలి ఏకాదశి పండుగ వేడుకలు.. -భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు

ఘనంగా తొలి ఏకాదశి పండుగ వేడుకలు.. -భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు
IMG_20260725_232242

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హిందువులు పవిత్రంగా, తొలి పండుగగా భావించే తొలి ఏకాదశి పండుగ వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా ఘనంగా జరుపుకున్నారు. తొలి ఏకాదశి పండుగ ను పురస్కరించుకొని ప్రజలు తమ ఇండ్లను చక్కగా అలంకరింప చేసుకొని విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంతే కాకుండా సమీపంలోని దేవాలయాలకు వెళ్లి అభిషేకాలు పూజలు నిర్వహించారు. తమ కుటుంబాన్ని చక్కగా చూడాలని వేడుకున్నారు. యాదవులు కురుమలు తొలి ఏకాదశి పండుగ రోజున తమ కుల దేవుడైన బీరన్న బోనాలను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకొని పలువురు తమ ఇళ్లలో పిండివంటలు చేసుకుని కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సహపంక్తి భోజనం చేశారు. పలువురు భక్తులు ఉపవాసాలు చేశారు.

కిటకిట లాడిన దేవాలయాలు

తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం, రామాలయం, అయ్యప్పస్వామి ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, కేసీ క్యాంపులోని వెంకటేశ్వరస్వామి ఆలయం, సింగపూర్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయం, పెద్ద పాపయ్యపల్లిలోని ఆంజనేయ స్వామి దేవాలయం లలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడంకి రావడంతో దేవాలయాలన్నీ కిటకిటలాడాయి. ఈ సందర్భంగా దేవాలయాల్లో వేద పండితులు నందకిషోర్ చార్యులు, శ్రీధర ఆచార్యులు, కిరణ్ కుమార్, సుజిత్ కుమార్, భాస్కర్ శర్మ, లలిత్ కుమార్ లు అభిషేకాలు, అష్టోత్తర నామాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగా కేసి క్యాంపు లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుజురాబాద్ న్యాయమూర్తులు పద్మ సాయిశ్రీ, వీణ ప్రణతి తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు.


@లోకల్ యాడ్స్@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!