Social 1080×1350 • Multi-page
26-07-2026 BREAKING NEWS 11:00 PM
swarnodayam.com
Telugu Daily News

మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి హుజురాబాద్ పట్టణ నాయకులు, కార్యకర్తలు.

మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన  బిజెపి హుజురాబాద్ పట్టణ నాయకులు, కార్యకర్తలు.
IMG-20260726-WA0061

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసారం చేసిన 136వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బిజెపి హుజురాబాద్ పట్టణ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.

ఈ సందర్భంగా దేశ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ పలు విషయాలను ప్రస్తావించారు. అందులో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగస్ఫూర్తి యువతకు స్ఫూర్తిగా నిలవాలని పేర్కొన్నారు.
భారత యువత ప్రతిభను కొనియాడుతూ, శాస్త్ర సాంకేతిక, ఆవిష్కరణలు, పరిశోధనల రంగాల్లో యువత సాధిస్తున్న విజయాలు దేశ గర్వకారణమని చెప్పారు.
విద్యార్థులకు ప్రేరణనిస్తూ, కొత్త ఆలోచనలు, కృషి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
క్రీడాకారుల విజయాలు గురించి ప్రస్తావిస్తూ, భారత క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై దేశానికి కీర్తి తీసుకొస్తున్నారని అభినందించారు.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, భారత రక్షణ సాంకేతికత, స్వదేశీ ఆయుధాలపై ప్రపంచ దేశాల విశ్వాసం పెరుగుతోందని తెలిపారు.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని కోరారు. క్యాచ్ ధ రెయిన్ నీటి వనరులను కాపాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, బూత్ ప్రభారులు నరాల రాజశేఖర్, బొరగాల సారయ్య తూముల శ్రీనివాస్ ఆవుల సదయ్య మంచిగట్ల మురళి కొల్లిపాక వెంకటేష్ రూపం అశోక్ రెడ్డి నల్ల సుమన్ సబ్బని రమేష్ యాంసాని శశిధర్ బొడిగె రాదా గంగిశెట్టి ప్రభాకర్ 25 వ కౌన్సిలర్ కొండ ప్రశాంతి 23 వ వార్డ్ కౌన్సిలర్ లక్ష్మీ దుర్గ ఎర్ర శ్రీధర్ కొలుగూరి సుమలత పడారి కొమరయ్య అంకతి వాసు యాటరాజేష్ క్యాస వెంకటేష్ నల్ల రాజకుమార్ నల్ల విజయ్ నల్ల అజయ్ తిప్పపతిని రాజు ఈదులకంటి శ్రీనివాస్ రెడ్డి కేశవ్ నాసాని నీలం రవీందర్ బొల్లోజు వినయ్ బెజ్జంకి రాజేందర్ కుసుమ సమ్మయ్య అనంతుల విక్రం తాటిపాముల రఘుపతి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!