Social 1080×1350 • Multi-page
27-07-2026 BREAKING NEWS 09:24 PM
swarnodayam.com
Telugu Daily News

కేరళ పాఠశాలలో ఆకట్టుకున్న బోనాల వేడుకలు..

కేరళ పాఠశాలలో ఆకట్టుకున్న బోనాల వేడుకలు..
IMG-20260727-WA0161

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ వేడుకలు హుజురాబాద్ పట్టణంలోని కేరళ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంతో ఘనంగా, కంటికి ఇంపుగా సాగాయి. విద్యార్థుల ఉత్సాహం, సాంప్రదాయ దుస్తుల కోలాహలంతో పాఠశాల ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

సాంప్రదాయ రీతిలో బోనాల సమర్పణ:

విద్యార్థినులు సాంప్రదాయ వస్త్రధారణతో నెత్తిన అలంకరించిన బోనాలు (ఘటాలు) ఎత్తుకొని పసుపు, కుంకుమలు, వేపాకులతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
​కళారూపాల కోలాహలం:

పోతురాజుల విన్యాసాలు, తంబూరాలు, జానపద నృత్యాలు మరియు దప్పుల దరువులతో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.


యాజమాన్యం సందేశం: కరస్పాండెంట్ పి సతీష్ కుమార్, డైరెక్టర్లు గౌతమ్ రెడ్డి, సంపత్.. మాట్లాడుతూ.. “పాఠ్యాంశాల బోధనతో పాటు మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు మరియు పండుగల ప్రాశస్త్యాన్ని విద్యార్థులకు తెలియజేయడమే మా ముఖ్య ఉద్దేశం. సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుంటూ, వాటిని భావి తరాలకు అందించడమే విద్యార్థుల లక్ష్యం కావాలి.”
​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను అత్యంత కోలాహలంగా విజయవంతం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!