Social 1080×1350 • Multi-page
28-07-2026 BREAKING NEWS 07:25 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలి – బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు

ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలి – బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు
IMG-20260728-WA0068

బీజేపీ హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించిన SIR ప్రవాస్ అభియాన్ కార్యక్రమం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన SIR ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు పాల్గొని బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

మాట్లాడుతున్న బిజెపి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హుజురాబాద్ పట్టణంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా ప్రక్షాళన (SIR) ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో BLA-2లు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జీలు, పార్టీ నాయకులు ప్రతి బూత్ స్థాయిలో సమీక్ష నిర్వహిస్తూ ప్రతి ఓటరును వ్యక్తిగతంగా సంప్రదించాలని సూచించారు.
ఓటరు జాబితా ప్రక్షాళనకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉన్నందున ప్రతి కార్యకర్త దీనిని ప్రజాసేవా కార్యక్రమంగా భావించి బాధ్యతతో పని చేయాలని పిలుపునిచ్చారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలైన తర్వాత కూడా పేరు లేని అర్హులైన ఓటర్ల వివరాలను ఫారం-6 ద్వారా నమోదు చేయాలని, అందుబాటులో లేని ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలని, ఎవరూ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని, ఓటరు జాబితా పూర్తిగా పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో స్వచ్ఛమైన ఓటరు జాబితా అత్యంత కీలకమని పేర్కొన్నారు.
అంతేకాకుండా, బూత్ స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని, పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, 23వ వార్డ్ కౌన్సిలర్ తూర్పాటి లక్ష్మీదుర్గ, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, మంచికట్ల మురళి, యంసాని శశిధర్, కొలిపాక శ్రీనివాస్, కొలిపాక వెంకటేష్, అంకటి వాసు, పోతుల సంజీవ్, పడారి కొమురయ్య, గంట సంపత్, ఓడ్నాల విజయ్, బోరగాల సారయ్య, యాల్ల సంజీవరెడ్డి, ఎర్ర శ్రీధర్, ఇల్లందుల ప్రణీత్, కొలుగూరి అనిల్, బొడిగె రాధ, ఆవుల సదయ్య, క్యాస వెంకటేష్, తేలుకుంట్ల శ్రీనివాస్, నల్ల అజయ్, మొలుగూరి రాజు తదితరులు పాల్గొన్నారు.


@లోకల్ యాడ్స్@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!